బయోమాస్‌‌‌‌ సేకరణకు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు అవసరం

బయోమాస్‌‌‌‌ సేకరణకు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు అవసరం
  • ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ వెల్లడి

న్యూఢిల్లీ: గ్యాస్ దిగుమతులు తగ్గించుకోవాలంటే   బయోమాస్‌‌‌‌ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్‌‌‌‌ పెట్టాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌‌‌‌ను సప్లయ్ చేయడానికి  మెషినరీ, ఎక్విప్‌‌‌‌మెంట్ల కోసమే రూ.30 వేల కోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా వేసింది.  ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ (లిక్విఫైడ్‌‌‌‌ నేచురల్ గ్యాస్‌‌‌‌)  దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. వరి గడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌‌‌‌ను  బయోఎనర్జీ  ఉత్పత్తికి వాడుకోవాలని  ఇండియన్ బయోగ్యాస్‌‌‌‌ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్  కేడియా అన్నారు. 

కానీ, దీనిని సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి ఖర్చువుతుందని, దీంతో వరి గడ్డి వంటి అగ్రి వేస్ట్‌‌‌‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికి రైతులు మొగ్గు చూపుతున్నారని  వెల్లడించారు.  ప్రభుత్వం  లాజిస్టిక్స్‌‌‌‌ను మెరుగుపరచడం కంటే  వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్‌‌‌‌మెంట్లను రైతులు వాడేలా ప్రోత్సహించాలన్నారు.