తండ్రి కొంపముంచిన కూతురి ఆన్ లైన్ క్లాస్

తండ్రి కొంపముంచిన కూతురి ఆన్ లైన్ క్లాస్

బెంగళూరు:  ఆన్ లైన్ క్లాస్ కోసం కూతురికి తన మొబైల్ ఇచ్చిన తండ్రి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ మొబైల్ లో తండ్రి రాసలీలల వీడియోలు చూసి షాక్ కు గురైన కూతురు ఆ వీడియోలను తల్లికి చూపించింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.  మండ్య జిల్లా, నాగమంగలకు చెందిన కుమార్ ఆన్‌లైన్ క్లాసుల కోసం కుమార్తెకు అతడి స్మార్ట్‌ ఫోన్‌  ఇచ్చాడు. కాసేపు.. క్లాసుల్లో నిమగ్నం అయిన కుమార్తె.. క్లాసులు అయిపోయాక తండ్రి స్మార్ట్‌ ఫోన్‌ లో కొన్ని ఫోల్డర్స్‌ను చూడగా వీడియోలు కనిపించాయి.

ఆ వీడియోల్లో ఆమె తండ్రి మరో మహిళతో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే.. ఆ వీడియోలను తల్లికి చూపింది. షాక్‌ కు గురైన తల్లి తాను అన్యాయానికి గురయ్యానని, న్యాయం చేయాలంటూ మహిళా సాంత్వన కేంద్రాన్ని ఆశ్రయించింది. నాగమంగల పోలీస్ స్టేషన్‌ లో కూడా భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.