ఆర్మీ నుంచి రూ.127 కోట్ల ఆర్డర్

ఆర్మీ నుంచి రూ.127 కోట్ల ఆర్డర్

న్యూఢిల్లీ: సిమ్యులేటర్ల సప్లై కోసం డిఫెన్స్​ ట్రెయినింగ్​ సొల్యూషన్స్​ కంపెనీ జెన్​ టెక్నాలజీస్​కు  ఆర్మీ నుంచి రూ.127 కోట్ల ఆర్డర్​ వచ్చింది. ఆర్మ్​డ్​ ఫోర్సుల్లో సిమ్యులేటర్ల వాడకాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని జెన్​ టెక్నాలజీస్​ సీఎండీ అట్లూరి అశోక్​ చెప్పారు. దేశంలో తయారైన  సిమ్యులేటర్లను వాడటం వల్ల ట్రైనింగ్​ బాగా ఇవ్వవచ్చని, డబ్బు కూడా ఎంతో ఆదా అవుతుందని వివరించారు. హైదరాబాద్​కు చెందిన ఈ కంపెనీ సెక్యూరిటీ ఫోర్సెస్​ ట్రైనింగ్​ అవసరాల కోసం సెన్సర్లు, సిమ్యులేటర్లు, డ్రోన్లు, యాంటీ–డ్రోన్లు తయారు చేస్తుంది. గడచిన పదేళ్లలో తాము పూర్తిస్థాయి టర్న్​ ఎరౌండ్​ సాధించామని అశోక్​ చెప్పారు. సమీప భవిష్యత్​లో తమకు మరిన్ని పెద్ద కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉందన్నారు. అగ్నిపథ్​ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.