రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరాటం ..బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరాటం ..బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

ఎల్బీనగర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేద్దామని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని స్వకులశాలి భవన్ లో జరిగిన సభలో  మాట్లాడారు. గతంలో మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీపీ మండల్, శివశంకర్ లాంటి వారు చేసిన పోరాటాల వల్ల బీసీలకు కొంత రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలంటే రిజర్వేషన్లతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫోరం అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, కర్నాటి మనోహర్ నేత, గోరా శ్యాంసుందర్
 పాల్గొన్నారు.