స్లాన్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ కర్తవ్య

స్లాన్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ కర్తవ్య

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్లాన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఫిడే రేటెడ్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన అనాద్కట్‌‌‌‌‌‌‌‌ కర్తవ్య చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. యూసుఫ్‌‌‌‌‌‌‌‌గూడ ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో మంగళవారం ముగిసిన టోర్నీలో కర్తవ్య 8.5 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణతేజను ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. టై బ్రేక్‌‌‌‌‌‌‌‌ స్కోర్ల తర్వాత అనూజ్‌‌‌‌‌‌‌‌ శ్రీవర్తి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించగా,  రామనాథన్‌‌‌‌‌‌‌‌ బాలసుబ్రమణ్యం మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

ALSO READ :ఒక్కరు పోతే వందమంది వస్తరు.. టికెట్‌ ఎవరికిచ్చినా గెలిపించుకుంటాం

టైటిల్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ కర్తవ్యకు ట్రోఫీతో పాటు లక్ష రూపాయల ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ లభించింది. ఏడు దేశాల నుంచి  525 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో మొత్తం 97 మందికి పది లక్షల నగదు, ట్రోఫీలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర చెస్‌‌‌‌‌‌‌‌ సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌‌‌‌‌‌‌‌ అందజేశారు.