బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే లాభపడొచ్చంటున్న ఎనలిస్టులు

బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే లాభపడొచ్చంటున్న ఎనలిస్టులు
  • 2022 ను స్వల్ప లాభాలతో ముగించిన సిల్వర్, గోల్డ్‌‌‌‌‌‌‌‌
  • గోల్డ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా పెరుగుతున్న కరోనా కేసులు, రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకుంటున్న ఆర్థిక వ్యవస్థలు

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మూడడుగులు ముందుకు..రెండడుగులు వెనక్కి అనే విధంగా  2022 లో గోల్డ్ కదలికలు సాగాయి.   కొత్త ఏడాదిలో గోల్డ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్ల పంట పండేలా కనిపిస్తోంది. పది గ్రాముల బంగారం ధర 2023 లో రూ.61 వేలను టచ్ చేస్తుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఔన్స్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ ధర  2022 మొదటి ఆరు నెలల్లో 2,000 డాలర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను క్రాస్ చేసింది.  రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో  నెలకొన్న అనిశ్చితి వలన బంగారంలోకి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు భారీగా రావడమే ఇందుకు కారణం. కానీ, డాలర్ వాల్యూ భారీగా పెరగడంతో ఆ తర్వాతి నెలల్లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ ధరలు తగ్గాయి. చివరికి ఔన్స్ గోల్డ్‌‌‌‌‌‌‌‌ రేటు జులై–ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో 1,615 డాలర్లకు పడిపోయింది.  వచ్చే ఏడాది గోల్డ్‌‌‌‌‌‌‌‌ దశ మారుతుందనే అంచనాలతో గత కొన్ని వారాలుగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. దీనికి దేశంలో ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌, పెళ్లిళ్ల సీజన్ తోడు కావడం కలిసొచ్చింది. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా ధరలు పెరిగితే స్పాట్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కూడా బంగారం ధరలు పెరుగుతాయన్న విషయం తెలిసిందే.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022 ను స్వల్ప లాభాలతో ముగించాయని స్వస్తిక ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్ సీనియర్ కమొడిటీ రీసెర్చ్ ఎనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ అన్నారు. వడ్డీ రేట్లను తక్కువగా పెంచుతామనే సంకేతాలను  యూఎస్ ఫెడ్ ఇవ్వడంతో  గోల్డ్‌‌‌‌‌‌‌‌కు రెక్కలొచ్చాయని  పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే  డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఫలితంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ను కొనడానికి ఇన్వెస్టర్లకు తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే ఏడాది  కరోనా కేసుల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలు స్లోడౌన్‌‌‌‌‌‌‌‌లో ఉండడం వంటి అంశాలు బంగారానికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని అంచనా. ‘ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా గోల్డ్ అవుట్‌‌‌‌‌‌‌‌లుక్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఔన్స్ గోల్డ్ ధర 2,290 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది 1,800 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  పది గ్రాముల బంగారం ధర  రూ. 60,000 లెవెల్‌‌‌‌‌‌‌‌ వరకు  కదలొచ్చు’ అని మార్కెట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ సుగంధ సచ్‌‌‌‌‌‌‌‌దేవ అంచనావేశారు. ఒకవేళ పడినా  రూ.52, 200, రూ. 49,500 వరకు పడొచ్చని, ఈ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని వివరించారు.

ఎందుకు పెరగొచ్చంటే..!

గోల్డ్ రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూఎస్ ఫెడ్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు  వడ్డీ రేట్లను పెంచడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ  రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకుంటోంది. ఈ పరిస్థితే వస్తే  వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు, ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ అయిన గోల్డ్‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తారు.  ఫలితంగా పసిడి ధరలు పెరుగుతాయి. వడ్డీ రేట్ల పెంపు 2022 లో ప్రారంభమవ్వగా, ఈ పెరిగిన రేట్ల ప్రభావం వచ్చే ఏడాది కనిపిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థలు రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకోవడం తప్పదని అంచనావేస్తున్నారు. కాగా, రెసిషన్ అంటే ఎకానమీలో యాక్టివిటీ పడిపోవడం. జీడీపీ తగ్గడం. దేశ ఎంసీఎక్స్ ఎక్స్చేంజిలో పది గ్రాములు గోల్డ్ ధర గత కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తోంది.  తాజాగా రూ.56,200 లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేసిన బంగారం, ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌ నుంచి కిందకి పడింది. దిగువన రూ.55 వేల దగ్గర ఎంసీఎక్స్ గోల్డ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ ఉంది. వచ్చే ఏడాది రూ.56,200 లెవెల్‌‌‌‌‌‌‌‌ను దాటగలిగితే గోల్డ్ ధర రూ.58,888 నుంచి రూ.61,111 వరకు వెళ్లగలదని ఛాయిస్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌ అంచనావేసింది. పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.55,000 దగ్గర క్లోజయ్యింది.