నేడు ట్రాక్షన్‌‌‌‌ టెక్నాలజీస్‌‌ ఐపీఓ ఓపెన్‌‌

నేడు ట్రాక్షన్‌‌‌‌ టెక్నాలజీస్‌‌  ఐపీఓ ఓపెన్‌‌

న్యూఢిల్లీ: ఎనాలసిస్‌‌ కంపెనీ ట్రాక్షాన్‌‌ టెక్నాలజీస్‌‌  ఐపీఓ నేడు ఓపెన్  కానుంది.  అక్టోబర్ 12 న ముగుస్తుంది. ఫేస్ వాల్యూ రూపాయి ఉన్న ఈ కంపెనీ షేరు రూ. 75–80‌‌‌‌ రేంజ్‌‌లో ఐపీఓలో అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3,86,72,208 షేర్లను షేరు హోల్డర్లు, ప్రమోటర్లు  అమ్మనున్నారు. ఇందులో 75 % షేర్లు క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం, 15 % షేర్లు నాన్ ఇన్‌‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కోసం, 10 % షేర్లు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా  రూ. 310 కోట్లు సేకరించాలని ట్రాక్షాన్ చూస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (185 షేర్ల) కోసం బిడ్ వేయాలి.

రిటైల్ ఇన్వెస్టర్ల కనీస ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ రూ.14,800 అవుతుంది.  గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్స్ వేసుకోవచ్చు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ల గరిష్ట ఇన్వెస్ట్‌‌మెంట్  రూ. 1,92,000 అవుతుంది. ట్రాక్షాన్‌‌ టెక్నాలజీస్‌‌ ఈ నెల 7 న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 139.22 కోట్లను సేకరించింది. సక్సెస్‌‌ఫుల్ బిడ్డర్లకు ఈ నెల 17 షేర్లను అలాట్ చేస్తారు. షేర్లు అలాట్ కాని వారికి ఈ నెల 18 న  అమౌంట్‌‌ను రీఫండ్ చేస్తారు.   20 న కంపెనీ షేర్లు మార్కెట్‌‌లో లిస్టింగ్ అవుతాయి.