అంబానీ ఇంటికి ప్రపంచ అధిరథ మహారథులు.. ప్రీ వెడ్డింగ్గే ఇలా ఉంటే..!

అంబానీ ఇంటికి ప్రపంచ అధిరథ మహారథులు.. ప్రీ వెడ్డింగ్గే ఇలా ఉంటే..!

ముఖేష్ అంబానీ.. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు.. అలాంటి ఇంట్లో పెళ్లి వేడుక అంటే మాటలా.. వేల కోట్ల రూపాయలను నీళ్లుగా ఖర్చు చేయటం కామన్.. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ తో పెళ్లి జరుగుతుంది. జూలైలో పెళ్లి చేసుకోబోయే ఈ జంట.. మార్చి ఒకటి నుంచి మూడు రోజులు.. అంటే మార్చి 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్ వేదిక అయ్యింది.

ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు అందరూ హాజరవుతున్నారు. వీరిలో వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహానాతో తన టీంతో హాజరైంది. మార్చి 2న ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ వచ్చేశారు. ఇక అతిధుల లిస్టులో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తోపాటు వివిధ దేశాల్లోని ప్రముఖ సీఈవోలు, చైర్మన్లు తరలివస్తున్నారు. 

ఇక ఇండియా పారిశ్రామికవేత్తల్లో గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా, కుమార మంగళం బిర్లా, గోద్రేజ్ గ్రూప్ చైర్మన్, టాటా గ్రూప్ సీఈవో ఇలా వందల మంది టాప్ సీఈవో, చైర్మన్లు హాజరవుతున్నారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరవుతున్నారు. ఇప్పటికే షారూఖ్ ఖాన్ ఫ్యామిలీతో సహా జాంనగర్ వచ్చేశారు. అదే విధంగా రణవీర్ సింగ్, దీపికా పదుకునే, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తోసహా చాలా మంది హీరో, హీరోయిన్స్ రాగా.. క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ఇప్పటికే జాంనగర్ వచ్చేశారు. 

గుజరాత్ రాష్ట్రం జాంనగర్ లో జరుగుతున్న ప్రపంచ కుబేరుడు అంబానీ ఫంక్షన్ కోసం.. వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జాంనగర్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానాల రాకతో రద్దీగా మారింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ హైప్రొఫైల్ వ్యక్తులు కావటంతో.. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ రోజు.. ఏ టైంకు హాజరవుతున్నారు అనేది ఇంకా ప్రకటించలేదు.. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఇలా ఉంటే.. పెళ్లి ఇంకెన్ని రోజులు చేస్తారో.. ఇంకెన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో కదా.. ఏమైనా డబ్బున్నోళ్ల ఇంట్లో వేడుక అంటే ప్రపంచానికే వేడుక కదా.. 

Also Read :నేను మరీ యంగ్ అయ్యానంటున్నరు!