
వాషింగ్టన్: తాను మరీ యంగ్ గా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారని అమెరికా అధ్యక్షుడు బైడెన్(81) చమత్కరించారు. ఏజ్ పెరగటం వల్ల బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందని ఓ నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయన తన జీవితంలోని కీలక సంఘటనలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. అయితే, ఈ నివేదికను బైడెన్ ఖండించారు. ఏడాదికి ఓసారి నిర్వహించే మెడికల్ టెస్టులు కూడా ఆయన బుధవారం చేయించుకున్నారు. పరీక్షల అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు. 'గత ఏడాది మాదిరిగానే ఎలాంటి తేడా లేదు. నేను మరీ యంగ్ గా కనిపిస్తున్నానని డాక్టర్లే చెప్పారు' అంటూ ఆయన సరదాగా కామెంట్ చేశారు.