V6 News

తెలంగాణలో మనసున్న సర్పంచ్.. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, రెండు శ్రీగంధం చెట్లు..

తెలంగాణలో మనసున్న సర్పంచ్.. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, రెండు శ్రీగంధం చెట్లు..

ఆడపిల్ల పుట్టిందని భార్యలను చంపేవారు కొందరు, చెత్తకుప్పల్లో పడేసే వారు ఇంకొందరు. భర్త, అత్తింటి వారి పోరుతో ఎందరో తల్లులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్న ఘటనలు ఎన్నో. అలాంటి నిరాదరణకు గురవుతున్న తల్లులకు అండగా.. చిన్నారుల భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా సర్పంచ్ చేసిన ఆలోచనకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిర్మల్  జిల్లా  ఆనంతపేట సర్పంచ్ మాదస్తు సునీత. బంగారు తల్లికి భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు. 

►ALSO READ | ఆంధ్రాలో 9 ఎయిర్ పోర్టులు.. తెలంగాణకు ఒక్కటే.. కేంద్రం పట్టించుకోవడం లేదు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
 
2026 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఆడ పిల్ల పుడితే  ఐదు వేల రుపాయల బహుమతి ఇస్తున్నారు. గ్రామంలో ఆడ పిల్ల పుట్టిన తల్లులకు  ఐదువేల రుపాయలు, రెండు  శ్రీ గందం చెట్లను  బహుమతిగా ఇచ్చారు. 

ప్రతి ఆడపిల్లకు భరోసానివ్వడమే లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు  సర్పంచ్ సునీత. ఆడ పిల్లలకు  అండగా నిలుస్తన్న సర్పంచ్ ను గ్రామస్తులు అభినందించారు.