జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు ఇద్దరు సైనికులు, పౌరుడు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు ఇద్దరు సైనికులు, పౌరుడు మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్, లాన్స్ నాయక్ ప్రవీణ్ శర్మ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారు. 

ఆదివారం సైనిక బలగాలు యాంటీ టెర్రరిస్ట్, కూంబింగ్ ఆపరేషన్లు ప్రారంభించాయి. కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్, జమ్మూకశ్మీర్ లో సైన్యం విసృతంగా ఉగ్రవాదుల గాలింపు చర్యలు చేపట్టింది. జైష్ తీవ్రవాదుల బృందం ఎత్తైన ప్రాంతంలోని సంచార గుడిసెలలో ఆశ్రయం పొందిందని ఇంటలీజెన్స్ రిపోర్ట్స్ అందాయి.

కోకెర్‌నాగ్‌లోని అహ్లాన్ గడోల్ అటవీ ప్రాంతంలో 19 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన అదనపు బలగాలతో అడవిలో 15 కిలో మీటర్ల రేడియేషన్ లో ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విధి నిర్వహణలో మరణించిన సైనికులకు సంతాపం ప్రకటించారు.