యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి వెర్సటైల్ క్యారెక్టర్స్‌తో నటిగా మెప్పిస్తోంది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘నాగబంధం’ ఒకటి. శుక్రవారం ఈ సినిమా నుంచి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. లీలావతి పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది.
తెలుపు చీరలో, ట్రైబల్ జ్యూవెలరీతో అనసూయ కనిపించిన తీరు పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. లీలావతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్‌గా నటించగా, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జులై 3న విడుదల కానుంది.
