రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది బుల్లితెర యాంకర్ అనసూయ(Anasuya). తాజాగా ఆమె నటిస్తున్న విమానం(Vimanam) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వూలో విజయ్ తో వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"నిజానికి నేను, విజయ్ గతంలో మంచి ఫ్రెండ్స్. కానీ 2017లో అర్జున్ రెడ్డి(Arjun reddy) సినిమా రిలీజైప్పుడు విజయ్ ఓ థియేటర్‌కు వెళ్లి సినిమాలో ఉన్న బూతు మాటల్ని అక్కడా మాట్లాడాడు. అభిమానులతో కూడా అనిపించాడు. సినిమాలో అంటే ఆ పాత్ర పోషించాడు ఓకే కానీ.. నిజ జీవితంలో కూడా ఆ వల్గారిటీని ఎంకరేజ్ చేయడం ఎందుకు? ఒక అమ్మగా నాకు ఆ పదం నచ్చలేదు. ఇదే మాట విజయ్‌కి కూడా చెప్పాను అంతే. కానీ సోషల్ మీడియాలో మాత్రం నాపై విపరీతమైన నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యింది. వాటిని పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయ్యాను. 2019లో విజయ్ తండ్రి "మీకు మాత్రమే చెప్తా(Meeku Matrame Cheptha)" అనే సినిమా తీశాడు. అందులో నాకు ఓ పాత్ర కూడా ఆఫర్ చేశాడు. ఆ సమయంలో నాకు పిడుగులాంటి ఒక వార్త తెలిసింది. విజయ్ దగ్గర పని చేసే వ్యక్తి.. డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని! అతడి టీమ్‌లో ఒక వ్యక్తి నాకు చెప్పాడు. అది విని నేను షాకయ్యాను. ఇదంతా విజయ్‌కి తెలియకుండానే జరుగుతుందా ? ఒకవేల విజయ్ చెప్పకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం వాళ్లకెంటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అను చేసిన ఈ కామెంట్స్ కు విజయ్ గానీ, విజయ్ టీమ్ గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.