అది నా తప్పే అనిపించింది.. అందుకే త్రివిక్రమ్కు సారీ చెప్పాను

అది నా తప్పే అనిపించింది.. అందుకే త్రివిక్రమ్కు సారీ చెప్పాను

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ(Anasuya) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన పెదకాపు1(Pedakapu1) సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ప్రేమ విమానం(Prema Vimanam) సినిమాతో తన అభిమానులను అలరించారు. ఓపక్క సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన చుట్టూ జరిగే విషయాలపై తనదైన శైలీలో స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు. 

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది(Attarintiki daredi) సినిమాలో ఇట్స్ టైమ్ టూ పార్టీ నౌ(Its time to party now) అనే పాట అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ నేను దానికి నో చెప్పాను. కారణం ఆ పాటలో అప్పటికే ఇద్దరు, ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు. అలా గుంపులో గోవిందలా చేయడం నాకు నచ్చదు. అందుకే నో చెప్పాను.

ALSO READ:- ODI World Cup 2023: కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. వరల్డ్ కప్ మ్యాచ్ రద్దు!

ఆ సమయంలో నాపై చాలా ట్రోలింగ్ జరిగింది. నా ముక్కు సూటి తనం కారణంగా అలా మొహం మీదే నో అని చెప్పేశా. అది నాకే తప్పుగా అనిపించింది. అందుకే త్రివిక్రమ్ గారికి సారీ చెప్పాను. ఇప్పుడు ఆ పద్ధతి చాలా వరకు మార్చుకున్నాను. ఎలాంటి పాత్ర అయినా సరే..  నటనకు స్కోప్ ఉండాలి అని ఫిక్స్ అయ్యాను.. అని చెప్పుకొచ్చారు అనసూయ. ప్రస్తుతం అనసూయకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.