ODI World Cup 2023: కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. వరల్డ్ కప్ మ్యాచ్ రద్దు!

ODI World Cup 2023: కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. వరల్డ్ కప్ మ్యాచ్ రద్దు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. దట్టమైన పొగమంచు ధాటికి 10 మీటర్ల దూరంలో ఉన్న మనుషులను సైతం గుర్తు పట్టలేకపోతున్నారు. వరుసగా మూడోరోజు శనివారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 540గా నమోదయ్యింది. దీంతో క్రికెటర్లు బయటకి అడుగుటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. 

వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌లో భాగంగా సోమవారం(నవంబర్ 6) నగరంలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కాలుష్యం అడ్డుపడుతోంది. ఇప్పటికే ఆయా జట్లు వైద్యుల సలహా మేరకు తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకొని హోటల్ గదులకే పరిమితమయ్యాయి. పరిస్థితి మరో రెండు రోజుల పాటు ఇలానే కొనసాగితే మ్యాచ్ రద్దు చేయడం తప్ప మరో దారి లేదనే మాటలు వినపడుతున్నాయి. దీనిపై ఐసీసీ, బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

శ్రీలంక 7.. బంగ్లాదేశ్ 9

వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇరు జట్ల ఆటతీరు అంతంత మాత్రమే. ఇప్పటివరకూ రెండూ ఏడేసి మ్యాచ్‌లు ఆడగా, శ్రీలంక రెండింటిలో.. బంగ్లాదేశ్ ఒక దాంట్లో విజయం సాధించాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడం తప్ప సెమీస్ చేరే అవకాశాలు దరిదాపుల్లో లేవు.