Cricket World Cup 2023: ఢిల్లోలో తీవ్ర కాలుష్యం.. ప్రాక్టీస్ ఆపేసిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

Cricket World Cup 2023: ఢిల్లోలో తీవ్ర కాలుష్యం.. ప్రాక్టీస్ ఆపేసిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

ఇండియాలో కాలుష్యం అధిక మోతాదులో ఉండడం సహజం. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో అయితే ఈ కాలుష్యం మరీ ఎక్కువగా ఉంటూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంది. కాలుష్యాన్ని నివారించే ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ సమస్య మాత్రం తగ్గడం లేదు. ఇదంతా చాలా సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నా.. తాజాగా వాయు కాలుష్యం వరల్డ్ కప్ మ్యాచ్ లకు పెద్ద అడ్డంకిగా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 6 న బంగ్లాదేశ్ శ్రీలంకతో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన బంగ్లా క్రికెటర్లు.. ఢిల్లీలోని వాయు కాలుష్యం విపరీతంగా ఉండడం వలన తమ ప్రాక్టీస్ ను విరమించుకుంది. "చాలా మంది (క్రికెటర్లు) నిన్న బయటకు వెళ్లారు. ఇప్పుడు వారికి ఒకరకమైన దగ్గు ఉంది. ఈ కారణంగా వారు అస్వస్థతకు గురి కాకుండా ప్రాక్టీస్ ను రద్దు చేస్తున్నాం". అని టీమ్ హోటల్‌లో జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ అన్నారు.

ముంబై వేదికగా రెండు రోజుల క్రితం భారత్-శ్రీలంక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం విపరీతంగా ఉండడం వలన  ఈ మ్యాచ్ లో బాణాసంచా కాల్చకూడదని బీసీసీఐ చెప్పింది.  అంతేకాదు ఢిల్లీ, ముంబై నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదనే రూల్ విధించింది. ఈ రెండు నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)