షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల

V6 Velugu Posted on Oct 27, 2021

YSRTP అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. బుధవారం తిమ్మాపూర్ నుంచి ఎలిమినేడు వరకు పాదయాత్ర చేయనున్నారు షర్మిల. రాచలూరు గ్రామంలో జనంతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. గాజులపురుగు తండా, బేగంపేట వరకు పాదయాత్ర చేస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత మాదాపూర్ మీదుగా ఎలిమినేడు వరకు పాదయాత్ర చేస్తారు షర్మిల. రాత్రి ఎలిమినేడులో బస చేస్తారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకి యాంకర్ శ్యామల తన మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.

Tagged YS Sharmila, Padayatra, , Anchor Shyamala

Latest Videos

Subscribe Now

More News