ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను : యాంకర్ శ్యామల

ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను : యాంకర్ శ్యామల
  • పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో యాంకర్ శ్యామల పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్​స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. సుమారు 3 గంటలపాటు పోలీసులు ఆమెను విచారించారు. 

విచారణ పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు చట్టాలపై పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల విచారణకు సహకరిస్తాను. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పడు నేనేమీ మాట్లాడలేను. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను’’అని ఆమె తెలిపారు.