Sreemukhi: నాకు వయసు పెరిగిపోతోంది.. పెళ్లిపై శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sreemukhi: నాకు వయసు పెరిగిపోతోంది.. పెళ్లిపై శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగులో ఉన్న అతికొద్ది మంది స్టార్ యాంకర్ లలో శ్రీముఖి(SreeMukhi) ఒకరు. తనదైన టాకింగ్ పవర్ తో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్  చేయడం ఆమెకు అలవాటే. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన అదుర్స్ తో యాంకర్ గా తొలి అడుగువేసి శ్రీముఖి.. కొద్దికాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగారు. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న చాలా షోస్ కి శ్రీముఖినే యాంకర్ గా కొనసాగుతున్నారు. ఓవైపు యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంటూనే.. మధ్య మధ్యలో సినిమాల్లో కనిపిస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవల చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియెట్ చేసిన కుర్రాళ్ళ మతులు పోగొట్టింది.   

ఇక శ్రీముఖి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం తెలుగులో పెళ్లికాని స్టార్ యాంకర్ ల లిస్టులో ముందుంది శ్రీముఖి. అందుకే ఆమె పెళ్లి గురించి ఎప్పుడూ ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఆమధ్య యాంకర్ ప్రదీప్, శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, అలాంటిదేం లేదని, వారు కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆ రూమర్స్ కి చెక్ పెట్టేశారు. 

ALSO READ :- ప్రతి ఫిబ్రవరి 29 మాత్రమే ఈ పేపర్ వస్తుంది.. ధరెంతో తెలిస్తే షాక్

ఇక తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగా.. దానికి శ్రీముఖి స్పందించారు. నాకు వయసు పెరిగిపోతోంది. ఇంట్లో కూడా పెళ్లిచేసుకోమని ప్రెజర్ పెరిగింది. త్వరలో నేను పెళ్లి చేసుకోవబోతున్నాను.. అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళ నుండి పెళ్లిపై నాకు ఎలాంటి ప్రెజర్ లేదు. నీ షోస్ వల్ల చాలా మందిని ఎంటర్టైన్ చేస్తున్నావు. అలాగే ముందుకు వెళ్ళు. మేము నిన్ను ఆపం. నీకు ఎప్పుడు పెళ్లిచేసుకోవాలి అనిపిస్తే అప్పుడే చేసుకో అని చెప్పారు. కాబట్టి ఇప్పట్లో పెళ్ళిచేసుకుని ఆలోచన లేదు. అంటూ తన పెళ్లిపై వస్తున్న వార్తలకు  పెట్టేసింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.