
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి చిత్రాలు తీసిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై పి. విమల నిర్మిస్తున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రింగుల జుట్టు, సన్ గ్లాసెస్‌తో, DJ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపించాడు రోషన్. న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.