
సుమ కనకాల..15 ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా, స్పెషల్ ప్రోగ్రాం అయినా సుమ ఉండాల్సిందే. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. యాంకరింగ్కు గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. ‘‘మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే అది కేవలం తెలుగు వాళ్లు చూపించిన అభిమానం, ప్రేమ. అవి లేకపోతే నేను లేను. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సుమ ఎందుకు యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తుంది? పూర్తిగా యాంకరింగ్ నుంచి తప్పుకుంటుందా? బ్రేక్ ఇచ్చి తర్వాత ఏం ప్లాన్ చేస్తుంది అంటూ నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.