
హైదరాబాద్,వెలుగు: యూరిక్ యాసిడ్ మూలంగా వచ్చే గౌట్ వ్యాధి కోసం తాము తయారు చేసిన'కొల్చిసిన్' క్యాప్సూల్స్కు యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూ ఎస్ ఎఫ్డీఏ) ఆమోదం తెలిపిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ క్యాప్సూల్స్ 0.6 మిల్లీగ్రాముల డోసుతో వస్తుంది. ఇది రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ (ఆర్ఎల్డీ), మిటిగేర్ క్యాప్సూల్స్ 0.6 ఎంజీ హిక్మాకు సమానం. గ్రాన్యూల్స్కు ఇప్పటి వరకు యూఎస్ ఎఫ్డీఏ నుంచి మొత్తం 64 ఏఎన్డీఏ అప్రూవల్స్ ఉన్నాయి. వీటిలో 63 ఫైనల్అప్రూవల్స్ ఉండగా, ఒకటి తాత్కాలిక అప్రూవల్. కోల్చిసిన్ క్యాప్సూల్స్ ప్రస్తుత వార్షిక యూఎస్ మార్కెట్ సుమారు 55 మిలియన్ల డాలర్లుగా ఉందని ఈ హైదరాబాద్ కంపెనీ తెలిపింది.