
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా హను రాఘవపూడి రూపొందించిన చిత్రం ‘అందాల రాక్షసి’. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం పదమూడేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు మేకర్స్.
జూన్ 13న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆకట్టుకునే ప్రేమకథ, ఎమోషన్స్‌తోపాటు రధన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్‌గా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ మ్యాజిక్ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..