
ఇంద్రాణి ధవళూరి లీడ్ రోల్‌లో నటిస్తూ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ దామోదర ప్రసాద్, వివేక్ కూచిభొట్ల.. ఇలాంటి క్లాసిక్ టైటిల్‌తో రాబోతున్న సినిమా కచ్చితంగా విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఇంద్రాణి మాట్లాడుతూ ‘తెలుగు ఇండస్ట్రీలో ‘స్వర్ణకమలం’ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. అందర్నీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే ‘సాగరసంగమం’ సినిమా గుర్తుకు వస్తుందని యూఎఫ్ఓ లక్ష్మణ్ అన్నారు. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, నిర్మల ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించాడు.