ఆగస్టు 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మరో హారర్ థ్రిల్లర్‌‌‌‌..

ఆగస్టు 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మరో హారర్ థ్రిల్లర్‌‌‌‌..

ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్స్‌‌కు ఉండే క్రేజ్ వేరు. తాజాగా బాలీవుడ్‌‌ నుంచి ‘అంధేరా’ అనే ఓ కొత్త హారర్ సిరీస్‌‌ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రియా బాపత్‌‌,  కరణ్‌‌వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి,  సుర్వీన్‌‌ చావ్లా లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ సిరీస్‌‌కు రాఘవ్‌‌ దర్‌‌‌‌ దర్శకత్వం వహించాడు. గౌరవ్‌‌ దేశాయ్‌‌ క్రియేటర్‌‌‌‌గా వ్యవహరించారు.

ఎక్సెల్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ సంస్థ నిర్మించింది. బుధవారం స్ట్రీమింగ్‌‌ వివరాలను తెలియజేస్తూ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  ఆగస్టు 14 నుంచి అమెజాన్‌‌ ప్రైమ్‌‌ వీడియోలో ఎనిమిది ఎపిసోడ్స్‌‌గా ఈ సూపర్ నేచురల్‌ హారర్ థ్రిల్లర్‌‌‌‌ ప్రసారం కానుంది.