
24 గంటలూ అందుబాటులో ఉండే చాట్‌బాట్
హైదరాబాద్, వెలుగు : ఆంధ్రా బ్యాంక్ తన చాట్‌బాట్ ‘అభి’ ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) ఆధారంగా కస్టమర్ల ప్రశ్నలకు ఈ చాట్‌బాట్ బదులిస్తుంది. కస్టమర్లు 24 గంటలలో ఎప్పుడైనా తమకు కావల్సిన సమాచారాన్ని పొందే వీలును అభి కల్పిస్తుంది. మొబైల్, డెస్క్‌టాప్ బ్రౌజర్ల ద్వారా, ఫేస్‌బుక్ మెసెంజర్, గుగుల్ అసిస్టెంట్‌ల సాయంతో చాట్‌బాట్‌కు కస్టమర్లు కనెక్ట్ కావొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్, లోన్స్, ఇన్సూరెన్స్, ఆధార్ సర్వీసెస్ సహా దేని గురించైనా ప్రశ్నలకు సమాధానాలను చాట్‌బాట్ ఇవ్వగలదని వివరించింది. బెంగళూరు ఏఐ స్టార్టప్ ఫోట్‌బాట్.ఏఐ ఈ చాట్‌బాట్ టెక్నాలజీ అందిస్తోందని పేర్కొంది.