స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు ఇచ్చే వడ్డీ మారలే.. వరుసగా ఆరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ వడ్డీ రేట్లు యధాతథమే

స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు ఇచ్చే వడ్డీ మారలే.. వరుసగా ఆరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ వడ్డీ రేట్లు యధాతథమే

న్యూఢిల్లీ:  ప్రభుత్వం సోమవారం  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ)తో సహా వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల  వడ్డీ రేట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌(జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ) కి గాను  మార్చలేదు.  వరుసగా ఆరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌కి గాను  వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించింది. చివరిసారిగా 2023-–24 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని స్కీమ్‌‌‌‌‌‌‌‌ల వడ్డీ రేట్లను సవరించింది.

ప్రధానంగా పోస్ట్ ఆఫీసులు,  బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి చిన్న మొత్తాల పొదుపు చేసే వారికి సురక్షితమైన, గ్యారంటీ రాబడి ఇచ్చే పెట్టుబడి ఎంపికలుగా ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రతి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది.  కానీ గత ఆరు త్రైమాసికాలుగా (అక్టోబర్ 2023 నుంచి) ఎలాంటి మార్పులు చేయలేదు. దీని వల్ల స్థిరమైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్లకు స్పష్టత లభిస్తోంది.

స్కీమ్‌‌‌‌‌‌‌‌ల వడ్డీ రేట్లు ఇలా..

స్కీమ్‌‌‌‌‌‌‌‌    వడ్డీ రేటు                                          (శాతాల్లో)


సుకన్య సమృద్ధి యోజన                                 8.2శాతం
మూడేళ్ల టర్మ్ డిపాజిట్                                    7.1 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)                   7.1శాతం
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్                         4శాతం
కిసాన్ వికాస్ పత్ర                                               7.5శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ)        7.7శాతం
మంత్లీ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ స్కీమ్                                       7.4శాతం