అక్టోబర్ 12న ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్..

అక్టోబర్ 12న ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్..

రామ్ పోతినేని హీరోగా  ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్  పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. రెండు పాటలు రిలీజ్ చేయగా, తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.  అక్టోబర్ 12న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

రామ్  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ   కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ  మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.   వివేక్, మెర్విన్  సంగీతం అందిస్తున్నారు.  నవంబర్ 28న  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.