ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు..

ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు..

ఏపీ లిక్కర్ కేసులో దూకుడు పెంచింది సిట్. ఈ కేసులో విచారణ ముమ్మరంగా జరుపుతున్న సిట్ వైసీపీ కీలక నేతల ప్రమేయంపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే ఒకసారి విజయసాయిని విచారించిన సిట్.. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని గతంలోనే తెలిపింది. ఈ మేరకు జులై 12న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి నోటీసులు జారీ చేసింది సిట్. 

లిక్కర్ కేసుకు సంబంధించి ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సిట్. ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18, 2025 తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సహా మిగతా నిందితుల వివరాలను సిట్ అధికారులకు వివరించినట్లు తెలిపారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయి రెండోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈసారి విచారణలో సిట్ అధికారులు విజయసాయిని ఏయే అంశాలపై ప్రశ్నించనున్నారు.. అందుకు విజయసాయిరెడ్డి ఏం సమాధానం ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. మరి, కూటమి సర్కార్ భావిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ద్వారా ఈ కేసులో జగన్ ప్రమేయంపై ఆధారాలు బయటికి వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.