ఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం.. వీళ్లకు సోషల్ మీడియా బ్యాన్.. త్వరలోనే చట్టం

ఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం.. వీళ్లకు సోషల్ మీడియా బ్యాన్.. త్వరలోనే చట్టం

సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా పిల్లల విషయంలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. సామాజిక  మాద్యమాల వినియోగం కారణంగా చిన్న పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులను దృష్టిలో ఉంచుకుని 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడయాను బ్యాన్ చేయనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆస్ట్రేలియా మాదిరిగా  బ్యాన్ విధించనున్నట్లు ఆయన గురువారం (జనవరి 22) తెలిపారు. 

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) లో పాల్గొన్న మంత్రి.. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్న పిల్లలు వాళ్లు ఎలాంటి కంటెంట్ కు ఎక్స్పోజ్అవుతున్నారో కూడా తెలియని పరిస్థిలో ఉంటారని తెలిపారు. వాళ్లు డైవర్ట్ కావడం కారణంగా మానసిక ఎదుగుదలలో చాలా మార్పులు వస్తున్నట్లు చెప్పారు.

16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేసేందుకు చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అవసరమైతే ఆస్ట్రేలియాలో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. 

2025 డిసెంబర్ లో.. ఆంథోనీ అల్బేనిస్ ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏండ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేస్తూ చట్టం చేశారు. ముఖ్యంగా టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్ మొదలైన సైట్స్, యాప్స్ లను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంటే పిల్లలు తమ పేరున కొత్త అకౌంట్స్ తీసుకోలేరు. అంతేకాకుండా ప్రస్తుతానికి వారికి ఉన్న అకౌంట్లు కూడా డీయాక్టివేట్ అవనున్నాయి.