P.V.సింధుకు 2ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ

P.V.సింధుకు 2ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ

ప్రముఖ బ్యాడ్మింటెన్ ప్లేయర్ పీవీ సింధుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ రూరల్ మండలి చినగ‌డిలి దగ్గర 2 ఎకరాల భూమిని పీవీ సింధుకు కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ భూమిని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్లేస్ లో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో జారీ చేసింది.

అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమి ఉప‌యోగించాల‌ని క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌ కోసం ఉపయోగించవద్దని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించింది.

తనకు భూమిని కేటాయిస్తే బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నెలకొల్పుతానని పీవీ సింధు గతంలో చెప్పింది. పీవీ సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం విశాఖలోని చినగ‌డిలి  దగ్గర స్థలాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది.