ఎల్​ అండ్​ టీ చేతికి భోగాపురం ఎయిర్​పోర్టు ప్రాజెక్టు

ఎల్​ అండ్​ టీ చేతికి భోగాపురం ఎయిర్​పోర్టు ప్రాజెక్టు

న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్​లోని భోగాపురం ఇంటర్నేషనల్​​ ఎయిర్​పోర్ట్ ​ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు తమకు దక్కినట్లు లార్సెన్​ అండ్​ టుబ్రో (ఎల్​ అండ్​ టీ) సోమవారం ప్రకటించింది. ఈ కాంట్రాక్టు విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

కానీ, కంపెనీ క్లాసిఫికేషన్​ ప్రకారం ఆర్డరు విలువ రూ. 2,500 కోట్లు –  రూ. 5 వేల కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. తొలి దశలో ఈ ఎయిర్​పోర్టు  6 మిలియన్​ పాసింజర్లను హ్యాండిల్​ చేసే కెపాసిటీతో ఏర్పాటు కానుంది.  ఆ తర్వాత ఈ కెపాసిటీని పెంచనున్నారు.