పాట్ కమ్మిన్స్‌కు షాక్.. టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ ఎవరంటే..?

పాట్ కమ్మిన్స్‌కు షాక్.. టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ ఎవరంటే..?

వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రారంభమ కావడానికి మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. నివేదికల ప్రకారం రాబోయే T20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తారని బలమైన టాక్ వినిపిస్తుంది. ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ ఆల్-రౌండర్‌కు సపోర్ట్ చేయడం షాకింగ్ గా మారింది.
 
ప్రస్తుతం ఆసీస్ వన్డే, టెస్ట్ కెప్టెన్ గా పాటు కమ్మిన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫించ్ రిటైర్మెంట్ తర్వాత మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2024లో వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లపై జరిగిన టీ20 సిరీస్ లో సైతం ఆసీస్ మేనేజ్ మెంట్ మార్ష్ నే కెప్టెన్ గా ప్రకటించింది. దైపాక్షిక సిరీస్ లో కెప్టెన్సీ చేసినా.. టీ20 వరల్డ్ కప్ కు మాత్రం అనుభవమున్న కమ్మిన్స్ నే కెప్టెన్ గా నియమిస్తారనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆలా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. 

కమ్మిన్స్ గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు. మరోవైపు మార్ష్ ఆస్ట్రేలియా టీ20 జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. మార్ష్ కెప్టెన్ లో దక్షిణాఫ్రికాతో 3 టీ20 ల సిరీస్ కు క్లీన్ స్వీప్ చేయగా.. విండీస్ ను 2-1 తో, న్యూజి లాండ్ ను 3-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. మరి వరల్డ్ కప్ సమయానికి సక్సెస్ ఫుల్ మార్ష్ కు ఓటేస్తారో లేకపోతే అనుభవమున్న కమ్మిన్స్ వైపు మొగ్గు చూపుతారో చూడాలి.