ప్రపంచంలో ఎనిమిదో వింతగా అంకోర్​వాట్​

ప్రపంచంలో ఎనిమిదో వింతగా  అంకోర్​వాట్​

ఇటలీలోని పాంపీని వెనక్కి నెట్టి కంబోడియాలోని అంకోర్​వాట్​ ప్రపంచంలో ఎనిమిదో వింతగా అవతరించింది. ఈ హిందూ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో ఖైమర్​ చక్రవర్తి సూర్యవర్మ–2 నిర్మించారు. ఇది మొదటగా విష్ణువు దేవాలయంగా, ఆ తర్వాత బౌద్ధ ఆలయంగా మార్చబడింది. దీన్ని యశోధరపుర అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ప్రధానంగా ఇసుక రాళ్లను ఉపయోగించి నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. 

యెనెస్కో దీన్ని 1992లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ దేవాలయ గోడలపైన హిందూ, బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలిచారు. ఈ ఆలయం 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 15 అడుగుల ఎత్తయిన గోడ, విశాలమైన కందకం ద్వారా రక్షించబడుతోంది. ఈ ఆలయం మేరు పర్వతాన్ని సూచించే ఐదు తామర ఆకారపు టవర్లను కలిగి ఉంది. దీన్ని హిందూ, బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా నమ్ముతారు. ఖైమర్​ సామ్రాజ్యానికి రాజధాని అంకోర్ వాట్​. ఖైమర్​ అనే పదం నోకోర్​ (రాజ్యం) సంస్కృత నగర (నగరం) నుంచి ఉద్భవించింది. ఇది కంబోడియాలోని సీమ్​ రీప్​ ఉత్తర ప్రావిన్స్​లో ఉంది.