
విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ
జమైకా: జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతితో అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్స్’ పేరుతో వరల్డ్‌వైడ్‌గా ప్రొటెస్ట్స్ వెల్లువెత్తుతున్నాయి. జాతి వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఐసీసీతోపాటు ఇతర క్రికెట్ బోర్డ్స్‌కు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ మంగళవారం కోరిన విషయం తెలిసిందే.
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను వర్ణ వివక్షతను ఎదుర్కొన్నానని సామీ హాట్ కామెంట్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన టైమ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరాతోపాటు తనను ఇండియా ఫ్యాన్స్ బాడీ కలర్‌కు సంబంధించి హేళన చేశారని గుర్తు చేసుకున్నాడు.
తిసారాతోపాటు తనను ‘కాలూ’ అని పిలిచే వారని, అయితే దానర్థం బలమైన వాడ్ని అనుకొని పట్టించుకోలేదని సామీ వాపోయాడు. కానీ హిందీలో నల్లగా ఉన్న వారిని కాలూ అని పిలుస్తారని తెలుసుకొని తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని వివరించాడు.