పర్వతగిరిలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కేసులు : కలెక్టర్ సత్యశారద

పర్వతగిరిలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కేసులు : కలెక్టర్ సత్యశారద

పర్వతగిరి(సంగెం), వెలుగు: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్​రిజిస్టర్లు, గోదాం, తూకం యంత్రాలు, రసీదు పుస్తకాలను పరిశీలించారు. 

యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. రైతులు అవసరం మేరకు యూరియా వాడాలని సూచించారు. ఏవో యాకయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, పీఎసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.