ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహర్రం ఉత్సవాలు ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహర్రం ఉత్సవాలు ప్రారంభం

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహర్రం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామాలు, పట్టణాల్లో పీర్లను ఊరేగిస్తూ ప్రజలు భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకున్నారు. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామంలో శివారులో ఉన్న దర్గాలో ఉదయం నుంచే అన్నదాన కార్యక్రమంలో చేపట్టగా పెద్ద ఎత్తున భక్తుల తరలివచ్చారు. మరో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. అంకోలి దర్గాలో పీర్ల ఊరేగింపు