
Income Tax Notice: మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియటంతో చాలా మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు హడావిడిగా ఉన్నారు. వాస్తవానికి ఫైలింగ్ కి గడువు జూలై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ ఆలస్యాల కారణంగా దానిని సెప్టెంబర్ 15 వరకు అంటే 45 రోజుల పాటు పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. అయితే రిటర్న్ ఫైలింగ్ సమయంలో కొందరు చేస్తున్న తప్పిదాలు వారికి అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.
అయితే ఈ ఏడాది పన్ను శాఖ ప్రతి రిటర్న్ దర్యాప్తు తర్వాతే వారికి ఏవైనీ రీఫండ్స్ చెల్లించాల్సి ఉంటే ప్రాసెసింగ్ చేయాలని చూస్తోంది. పైగా కొత్త టెక్నాలజీల ఆధారంగా రిటర్న్స్ వెరిఫై చేయటం, అలాగే గత సంవత్సరాలకు సంబంధించిన రిటర్న్స్ పోల్చి చూడటం వంటి పద్ధతులను ఫాలో అవ్వాలనుకుంటోంది. అందుకే ఈసారి రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని అందించటం మంచిది. అలాగే రిటర్న్స్ దాఖలు తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద దాదాపు లక్ష 65వేల రిటర్న్స్ పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇది సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం కొంత అప్రమత్తతను సూచిస్తోంది. పన్ను రిటర్న్ దాఖలు తర్వాత ఎప్పుడైనా అధికారులు అందులో సరైన సమాచారం లేకపోవటం లేదా అధిక రిస్క్ సూచించే ట్రాన్సాక్షన్లు గమనించటం, ఆదాయాన్ని తక్కువగా చూపించటాన్ని గమనిస్తే విచారణకు నోటీసులు పంపే ప్రమాదం ఉంటుంది.
అసలు ఏఏ కారణాలకు పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ టాక్స్ అధికారుల నుంచి నోటీసులు అందుకోవచ్చు..
* పన్ను రిటర్న్ లో చూపించిన ఆదాయానికి టీడీఎస్ వివరాలకు పొంతనలేనప్పుడు నోటీసులు రావొచ్చు. ఇది ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు తరచుగా ఎదురయ్యే సమస్య.
* పన్ను చెల్లింపుదారులు తమకు ఉన్న అన్ని ఆదాయాలను రిటర్న్స్ లో పొందుపరచనట్లు గుర్తించినప్పుడు. వీటిలో క్రిప్టో పెట్టుబడులు, విదేశాల్లోని పెట్టుబడులు కూడా పరిగణలోకి వస్తాయి.
* పన్ను చట్టాల్లోని సెక్షన్ 80సి, 80డి, సెక్షన్ 10 కింద ఏవైనా తప్పుడు రీఫండ్స్ క్లెయిమ్ చేసినప్పుడు నోటీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో తప్పుడు అద్దె చెల్లింపులు, తారుమారు చేయబడిన క్రిప్టో లాభాలు వంటివి గుర్తిస్తే సెక్షన్ 240ఏ కింద 200 శాతం వరకు పెనాల్టీలు వేస్తారు.
*రిటర్న్స్ లో ఒక్కసారిగా గత సంవత్సరాల కంటే ఆదాయం తక్కువగా ఉన్నట్లు చూపితే ప్రధానంగా ఉద్యోగం చేసే పన్ను చెల్లింపుదారులు నోటీసులను ఎదుర్కోవచ్చు.
- సేవింగ్స్ ఖాతాల్లో ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే నోటీసులు రావొచ్చు..
- ఒక ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు చేయటం
- ఏడాదిలో రూ.2 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయటం
- ఏడాదిలో రూ.2 లక్షలు లేదా ఎక్కువ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం
- రూ.5 లక్షలు విలువైన బాండ్స్ లేడా డిబెంచర్లను కొనటం
- రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఈక్విటీ పెట్టుబడులు పెట్టడం
- ఆర్థిక సంవత్సరంలో ఏదేనా ఆస్థి కొనుగోలు కోసం రూ.30 లక్షల చెల్లింపులు చేయటం
- రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లలో రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టడం
- పన్ను అధికారులకు ఉద్యోగం మార్పుల సమయంలో సరైన సమాచారం ఫారమ్ 16ఎస్ కింద అందించకపోవటం
- తప్పుడు ఐటీఆర్ ఫారం పూర్తి చేయటం
- కావాలనే కొన్ని డబ్బు ఎంట్రీలు, సమాచారాన్ని రికార్డుల్లో ఉంచకపోవటం లేదా తప్పుగా ఎంట్రీలు చేయటం