
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ పై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. సినిమాల పరంగా కాకుండా పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తూ భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. స్టార్స్ సైతం బైటికి వచ్చి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నటి అనికా సురేంద్రన్ కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది.
నటి అనికా సురేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాలో ఆయనకు కూతురుగా నటించి ప్రశంసలు అందుకుంది. ఆతరువాత బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. తెలుగు తమిళంలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు. ఓపక్క సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు అనికా. అయితే సోషల్ మీడియాలో ఆమె డ్రెస్సింగ్ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారట నెటిజన్స్. ఇదే విషయం స్పందించారు అనికా.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలామంది నెటిజన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్లామరస్ గా కనిపించేలా డ్రస్ వేసుకోవడం అనేది నా వ్యక్తిగత విషయం. ఎవరికోసం నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు.. చీర కట్టినా కామెంట్స్ చేస్తారు. కానీ, నా డ్రస్సింగ్ గురించి చేసే కామెంట్స్ నన్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి. నేను కూడా మనిషినే కదా.. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం కష్టం. అంటూ చెప్పుకొచ్చింది అనికా.