
బుట్టబొమ్మ హీరోయిన్ అనికా సురేంద్రన్ చనిపోయిందనే పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ విశ్వాసంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యింది అనికా సురేందర్.
2019లో విడుదలైన ఈ సినిమాలో అజిత్ కూతురిగా ఆమె అద్భుతంగా నటించింది. దీంతో.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అప్పట్నుంచి అజిత్ రీల్ కూతురిగానే ఆమెను అందరూ గుర్తుపడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత పలు తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. తాజాగా తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారింది అనికా. ఇక తాజాగా అనికా చనిపోయింది అనే పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్టర్.. ఓ సినిమా కోసం చేసిన రీల్ పోస్టర్ అని తెలిసింది. దీంతో.. ఆమె అభిమానులు, సన్నిహితులు ఊపిరిపీల్చుకున్నారు.