ఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ

ఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ

ప్రముఖ బిజినెస్మెన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ 2023 జూలై03న  ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. యెస్ బ్యాంకుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నిస్తున్నారు. యెస్ బ్యాంక్ లోన్ కిక్ బ్యాక్ కేసుకు సంబంధించి అంబానీ చివరిసారిగా 2020లో ఈడీ ముందు హాజరయ్యారు. 

మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి యెస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్‌తో పాటు అనిల్ అంబానీకి గతంలో ఈడీ  సమన్లు ​​జారీ చేసింది. నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పిఎ) మారిన యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు అత్యధికంగా రుణాలు తీసుకున్నాయని అధికారులు తెలిపారు. 

ALSO READ:అస్ట్రేలియాకు బిగ్ షాక్.. నాథన్ లియాన్ ఔట్  

అనిల్‌ అంబానీకి చెందిన 9 కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. అయితే కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ పేర్కొంది.  గతేడాది సెప్టెంబర్‌లోఅనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరడంతో బాంబే హైకోర్టు రూ. 420 కోట్ల పన్ను ఎగవేత కేసులో అంబానీకి కొంత ఉపశమనం ఇచ్చింది .