- 1,270 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ బుధవారం భూటాన్‌లో అడుగుపెట్టింది. హిమాలయ దేశంలో 1,270 మెగావాట్ల సోలార్ జలవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీనికోసం భూటాన్ వాణిజ్య పెట్టుబడి విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్ గ్రూప్, డ్రక్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ప్రత్యేకంగా సౌర జలవిద్యుత్ కార్యక్రమాలపై దృష్టి పెడతాయి. భూటాన్‌లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడుల కోసం అనిల్ అంబానీ గ్రూపు రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది వచ్చే రెండేళ్లలో 250 మెగావాట్ల చొప్పున రెండు దశల్లో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.