
Anil Ambani: అనిల్ అంబానీ ఒకప్పుడు డిఫెన్స్ రంగంలోకి అడుగుపెట్టాలని తీసుకున్న నిర్ణయం ఇన్నాళ్లకు ఫలవంతంగా మారుతోంది. దాదాపు రెండు దశాబ్ధాల పాటు వ్యాపార ప్రపంచంతో కొంత దూరం మెయింటెన్ చేసిన అనిల్ అంబానీ దివాలా తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం సరైన దారిలో ఆడుతున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రాకి అనుబంధ సంస్థ రూ.600 కోట్ల విలువైన రక్షణ రంగ డీల్ కుదుర్చుకుంది. దీంతో రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ షేర్లు నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి రూ.404.05 స్థాయికి చేరుకున్నాయి. చాలా కాలంగా అనిల్ అంబానీ డిఫెన్స్ రంగంలో కొనసాగిస్తున్న విజయ పరంపర రిలయన్స్ ఇన్ ఫ్రా షేర్లను క్రమంగా పెంచుతోంది.
డీల్ వివరాలను పరిశీలిస్తే.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన రక్షణ అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్, ప్రముఖ జర్మన్ రక్షణ తయారీదారు రీన్‌మెటాల్ నుంచి రూ.600 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకున్నట్లు ప్రకటించింది. దీంతో అనిల్ అంబానీ సంస్థ పేరు మరోసారి వార్తల్లో ప్రధానంగా నిలిచింది.