OTT Movie: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ సిరీస్. . ‘మోతెవరి లవ్‌‌‌‌ స్టోరీ’ కథేంటీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ సిరీస్. . ‘మోతెవరి లవ్‌‌‌‌ స్టోరీ’ కథేంటీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌‌‌‌ స్టోరీ’. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా నటించిన ఈ సిరీస్‌‌‌‌కు శివ కృష్ణ బుర్రా దర్శకుడు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మించారు. ఇవాళ శుక్రవారం (ఆగస్ట్ 8) నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో అనిల్ గీలా మాట్లాడుతూ ‘మా అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్. మేం కన్న కలకు అందరం ఆయుధంగానే పని చేశాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సకుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా చూసుకునేలా మా సిరీస్ ఉంటుంది’ అని చెప్పాడు.

ఇందులో తన పాత్ర అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని వర్షిణి చెప్పింది. ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు చెప్పారు. నటులు సదన్న, మాన్సీ, రాజు, రవి చంద్ర,  మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ప్రేమ, కామెడీ వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ తెరకెక్కింది.

ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో కామెడీ, లవ్ సహజమైన రీతిలో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే, తెలంగాణ పల్లె వాతావరణంలో ఎన్నో తెలుగు సినిమాలు వచ్చాయి. దాదాపు వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లన్నీ ఆడియన్స్కు వీపరీతంగా నచ్చేశాయి. ఇప్పుడు మోతెవరి లవ్ స్టోరీ కూడా ఆ కోవాలనే సాగడం విశేషం. 

మోతెవరి లవ్ స్టోరీ కథేంటంటే?

ఈ సిరీస్ తెలంగాణలోని ఆరెపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. ఈ పల్లెటూర్లో సత్తయ్య, నార్సింగ్ ఇద్దరు అన్నదమ్ములుంటారు. వారే ఆ ఊరికి గ్రామ పెద్దలు. వారి నాన్నే మోతెవరి. అయితే, వాళ్ళ తండ్రి చనిపోయేముందు ఓ మహిళకు ఐదు ఎకరాల భూమి రాసిస్తాడు.

ఈ క్రమంలోనే ఆరెపల్లిలో రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే అదే గ్రామంలో ఉండే ఆ ఇద్దరు అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చిన భూమి కోసం తగాదా పడుతుంటారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న లవ్ జంటకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి.

అసలు వీరి ప్రేమకు ఆ భూ తగాదాలకు సంబంధం ఏంటి? పార్షి వాళ్ళ అమ్మమ్మకి మోతెవరికి మధ్య ఉన్న సంబంధమేంటీ? వారసత్వంగా వచ్చిన భూమి కోసం ఈ అన్నదమ్ములు ఏం చేశారు? చివరికి పార్షి, అనిత ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఓ భూ వివాదం, కుటుంబ ప్రతిష్ట, వారసత్వం మధ్య ఇంట్రెస్టింగ్గా సాగే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్నీ కలగలిపి తెరకెక్కించిన విధానం బాగుంది. కథా వస్తువు చిన్నదే అయిన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చివరి ఎపిసోడ్ వరకు చూసేలా ఉంటుంది. నవ్విస్తూనే అందరిని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా, వీరి ప్రేమకు వచ్చిన అడ్డంకుల నేపథ్యంలో వచ్చే సీన్స్కి.. ఆడియన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అవుతారు.

అనిల్ గీలా ఎడిటింగ్ చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టనివ్వదు.  బాగుంది. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను చక్కగా చూపించారు. చరణ్ అర్జున్ ఇచ్చిన సాంగ్స్, బిజిఎమ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. శివకృష్ణ బుర్ర రాసుకున్న కథతో మాత్రమే కాకుండా తెరకెక్కించిన విధానంలో కూడా సక్సెస్ అయ్యాడు.