కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..

కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  అనిల్ కుమార్ యాదవ్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటుంబ సభ్యులతో  కలిసి వెళ్లారు అనిల్ యాదవ్. ఈ సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ నుంచి సీనియనర్ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.  మూడు స్థానాలకు మూడు నామినేషన్లే రావడంతో వీరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు రిజర్నింగ్ అధికారులు ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ప్రకటించారు.