ఎవరీ అనిల్‌‌‌‌‌‌‌‌? .. జూనియర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చైర్మన్‌‌‌‌‌‌‌‌ వరకు!

ఎవరీ అనిల్‌‌‌‌‌‌‌‌? ..  జూనియర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చైర్మన్‌‌‌‌‌‌‌‌ వరకు!
  • టాలెంట్ ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన ఎల్ అండ్ టీ చైర్మన్ అనిల్‌‌‌‌‌‌‌‌ మనిభాయ్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌
  • 21 ఏళ్లలో సెలవులు తీసుకోలే..రోజుకి 15 గంటల  పని
  • తన సంపదలో 75 శాతం దానాలకే

బిజినెస్‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జూనియర్ లెవెల్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జాయిన్‌‌‌‌‌‌‌‌ అయ్యి దేశంలోనే అతిపెద్ద కంపెనీని సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా నడుపుతున్న స్టేజ్‌‌‌‌‌‌‌‌కి చేరుకున్నారు అనిల్‌‌‌‌‌‌‌‌ మనిభాయ్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌. ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ కంపెనీ అంటే ముందు గుర్తుచ్చేది లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ). ఈ కంపెనీకి 2003 లో చైర్మన్‌‌‌‌‌‌‌‌గా, 2018 లో మొత్తం గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఆయన ఎన్నికయ్యారు.  ఆయన నేతృత్వంలో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ కేవలం  కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ మాత్రమే కాకుండా దేశాభివృద్ధికి తోడ్పడే డిఫెన్స్‌‌‌‌‌‌‌‌, నూక్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌,  పవర్ వంటి  వివిధ సెక్టార్లలో  విస్తరించింది. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎక్కడి వరకైనా వెళ్లగలరడానికి ఆయనొక నిదర్శనం. 1965 లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టీలో జాయిన్ అయిన అనిల్‌‌‌‌‌‌‌‌, గత 21 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇప్పటికి కూడా రోజుకి 15 గంటల పాటు పనిచేస్తున్నారు. ఆయన  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 తో  రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానున్నారు. 

ఎవరీ అనిల్‌‌‌‌‌‌‌‌? 

అనిల్ మనిభాయ్‌‌‌‌‌‌‌‌ నాయక్ గుజరాత్‌‌‌‌‌‌‌‌లో 1942  జూన్‌‌‌‌‌‌‌‌ 9 న పుట్టారు.  గుజరాత్‌‌‌‌‌‌‌‌ బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజ్‌‌‌‌‌‌‌‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశారు. ఆయన తండ్రి మనిభాయ్‌‌‌‌‌‌‌‌ నిచ్చాభాయ్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌  ఫ్రీడమ్ ఫైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  గ్రామీణ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముంబైలోని తన టీచర్  జాబ్‌‌‌‌‌‌‌‌ను వదిలేశారు. అనిల్ మనిభాయ్‌‌‌‌‌‌‌‌ నాయక్ 1965 లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీలో జాయిన్ అవ్వగా, అప్పటి ఆయన శాలరీ నెలకు రూ.760. కేవలం ఆరు నెలల్లోనే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజరీ పొజిషన్‌‌‌‌‌‌‌‌కు ప్రమోట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

ఆ తర్వాత 18 నెలల్లోనే 800 మందిని చూసుకునే స్టేజ్‌‌‌‌‌‌‌‌కు ప్రమోట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. అప్పటికి ఆయన వయుసు 25 ఏళ్లు కూడా దాటలేదు. అనిల్ మొదట నెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయిలర్స్‌‌‌‌‌‌‌‌లో జాబ్ కోసం ట్రై చేశారు. అది వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఎల్ అండ్ టీలో జాయిన్ అయ్యారు. అనిల్ నాయక్‌‌‌‌‌‌‌‌కు 2009 లో  పద్మ భూషణ్ అవార్డు దక్కింది. రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిలియన్ అవార్డ్‌‌‌‌‌‌‌‌ పద్మ విభూషణ్‌‌‌‌‌‌‌‌ను 2019 లో పొందారు. ఎకనామిక్ టైమ్స్‌‌‌‌‌‌‌‌–బిజినెస్‌‌‌‌‌‌‌‌ లీడర్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది  ఇయర్ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను 2008 లో దక్కించుకున్నారు. 

సంపద..

ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ టాప్‌‌‌‌‌‌‌‌ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అనిల్ నాయక్‌‌‌‌‌‌‌‌ 2017–18 లో రూ.137 కోట్లు సంపాదించారు. అతని లీవ్స్‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌క్యాష్ చేయడంతో రూ.19 కోట్లు వచ్చాయి. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ట్రేడవుతున్న 9 షేర్లలో రూ.171.3 కోట్లను ఇన్వెస్ట్ చేశారు కూడా. ఎల్ అండ్ టీ  2022–23 యాన్యువల్‌‌‌‌‌‌‌‌  రిపోర్ట్ ప్రకారం, అనిల్ నాయక్‌‌‌‌‌‌‌‌ రూ.3.37 కోట్ల విలువైన కాంపెన్సేషన్స్‌‌‌‌‌‌‌‌ పొందారు. దీనికి అదనంగా రూ.3 కోట్ల విలువైన పెన్షన్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా దక్కించుకున్నారు.  

ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా..

దేశంలో  యువత స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరిచేందుకు పనిచేస్తున్న  నేషనల్ స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ) కు  చైర్మన్‌‌‌‌‌‌‌‌గా అనిల్ నాయక్‌‌‌‌‌‌‌‌ పనిచేశారు. 2018 లో ఈ స్థానానికి ఆయన్ని ప్రభుత్వం నియమించింది.

దానాల్లో మేటి...

సంపాదించడంలోనే కాదు ఆ  సంపదను దానం చేయడంలో కూడా అనిల్ నాయక్ ముందున్నారు. దానాలు చేయడానికి నిరాలి మెమోరియల్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్ ఫర్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయక్‌‌‌‌‌‌‌‌ ఛారిటబుల్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ను 2016 లో స్థాపించారు. తన సంపదలో 75 శాతాన్ని ఇందుకోసం కేటాయించారు. 

యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న తన కొడుకు, కోడలు తిరిగి రాకపోతే తన మొత్తం సంపదను దానం చేసేస్తానని ప్రకటించారు కూడా.  నిరాలి మెమోరియల్‌‌‌‌‌‌‌‌ మెడికల్ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ గుజరాత్‌‌‌‌‌‌‌‌ (నవసరి) లో క్యాన్సర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు 2019 లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 2022 లో దానాలు చేసిన టాప్‌‌‌‌‌‌‌‌ 10 లో అనిల్ నాయక్ కూడా ఉన్నారు. ఆయన ఏకంగా రూ.142 కోట్లను దానం చేశారు.