
‘‘నా గత రెండు చిత్రాలూ సంక్రాంతికి వచ్చాయి. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికొస్తే నాకు హ్యాట్రిక్ అయ్యేది. కానీ పెద్ద సినిమాలు వస్తుండడం, సోలోగా రావాలని మేమూ ఫిక్సవడంతో ఫిబ్రవరికి వాయిదా వేశాం. ఈ ఇయర్ బర్త్‌డేకి షూట్‌లోనే ఉండబోతున్నా. ‘ఎఫ్ 2’లోని క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ ఇందులోనూ ఉన్నప్పటికీ ఇది సెపరేట్ సబ్జెక్ట్. ఇందులో హీరో హీరోయిన్స్ భార్యాభర్తలు కారు. వాళ్లు ఎలా కలుసుకున్నారనేది కొత్త స్టోరీ. ఫన్, ఫ్రస్ట్రేషన్‌తో పాటు మనీని కూడా యాడ్ చేశాం. ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో కామన్ పాయింట్. దాంతో ఒక ఫ్రాంచైజీ చేస్తుండడం హ్యాపీ. వెంకటేష్ గారికి రేచీకటి, వరుణ్‌తేజ్‌కి నత్తి ఉంటాయి. సినిమాలో ఎక్కడ అవసరమో అక్కడే ఆ సీన్స్ ఉంటాయి. ఇద్దరూ ఫుల్ ఎనర్జీతో నటిస్తున్నారు. సునీల్, మురళీశర్మల పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. మేనరిజమ్స్ కంటే యాక్టివిటీస్ ఎక్కువుంటాయి. ఈమధ్యనే ముప్ఫై ఐదు మందితో పది రోజుల పాటు క్లైమాక్స్ తీశాం. అంతమందిని హ్యాండిల్ చేయడంతో కెరీర్‌లో మొదటిసారి అలసిపోయా. ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. పది రోజుల టాకీ పార్ట్, రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. డిసెంబర్ ఎండింగ్‌కి టాకీ పూర్తవుతుంది. ఇక ‘గాలి సంపత్’ నా ఫ్రెండ్ కోసం చేసిన సినిమా. ఆ మూవీ రిజల్ట్ గురించి నాకు బాధ లేదు. అదో డిఫరెంట్అటెంప్ట్ అంతే. టాలీవుడ్‌లో కంఫ ర్టబుల్‌గా ఉన్నాను. ఈ కుర్చీ వదిలి మరో భాషకు వెళ్లాలనుకోవడం లేదు. ఆరేళ్ల కెరీర్‌లో ఎక్కిన ప్రతి మెట్టు ఎక్సైటింగ్‌గా ఉంది. ఇదో లెర్నింగ్ ప్రాసెస్. ఎంటర్‌టైన్మెంట్‌ని సేఫ్ జోన్‌గా ఫీలవడం లేదు. త్వరలో బాలకృష్ణ గారితో చేయబోయేది కూడా ఎంటర్‌టైనర్ కాదు. ఆయనతో పూర్తి స్థాయి కామెడీ మూవీ చేయలేం. అందుకే కొత్త యాంగిల్‌లో చేయబోతున్నా. ఆయన స్ట్రెంగ్త్, కేపబులిటీస్‌కి తగ్గ సినిమా. జనవరి నుంచి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. జూన్ లేదా జులైలో సినిమా మొదలెడతాం.’’ – అనిల్ రావి పూడి, దర్శకుడు