హైదరాబాద్​లో అనిరుధ్​ రెడ్డి హౌస్​ అరెస్ట్

హైదరాబాద్​లో అనిరుధ్​ రెడ్డి హౌస్​ అరెస్ట్
  • బయటకు వెళ్లనివ్వట్లేదంటూ సెల్ఫీ వీడియో  పెట్టిన జడ్చర్ల కాంగ్రెస్​ అభ్యర్థి

మహబూబ్​నగర్​, వెలుగు : జడ్చర్ల కాంగ్రెస్​ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​ రెడ్డిని పోలీసులు హౌస్​అరెస్ట్​ చేశారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో ఆయన హైదరాబాద్​లోని తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

ఎవరిని ఇంట్లోకి వెళ్లనివ్వకుండా, అనిరుధ్​ రెడ్డిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఈ సందర్భంగా అనిరుధ్​ రెడ్డి తనను హౌస్​ అరెస్ట్​ చేశారంటూ సెల్ఫీ వీడియోను రిలీజ్​ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే బీఆర్ఎస్​అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.