అంజలి కెరీర్​ యూటర్న్​

అంజలి కెరీర్​ యూటర్న్​

కుర్ర హీరోయిన్ల తాకిడికి సీనియర్​ హీరోయిన్లు జోరు తగ్గించేస్తుంటారు. కానీ, సౌత్​ ఇండస్ట్రీలో తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నాలుగు పదుల వయసులో త్రిష సత్తా చూపుతోంది. నయన తార స్టార్​ హీరోలతో ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పుడు తెలుగమ్మాయి అంజలి కూడా అదే బాటలో నడుస్తోంది. షాపింగ్​ మాల్​, జర్నీ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న అంజలికి తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. 

కానీ, ఆ మధ్య చేసిన కొన్ని వెబ్​ సిరీస్​లు ఆమె కెరీర్​ను మార్చేశాయని చెప్పొచ్చు. గ్లామర్​ షోకి హద్దులు చెరిపేసి చేసిన సీన్లు ఆమెకు కలిసొచ్చాయి. దీంతో శంకర్​– రాంచరణ్​ కాంబోలో వస్తున్న గేమ్​ఛేంజర్​లో చాన్స్​ కొట్టేసింది. ప్రస్తుతం కుర్ర హీరో విశ్వక్​ సేన్​ సినిమాలో రత్నమాలగా పవర్​ఫుల్​ రోల్​ చేస్తోంది. ఈ సినిమాలు క్లిక్​ అయితే అంజలి కెరీర్​ పరంగా బిజీగా మారే చాన్స్​ ఉంది. ఇటీవల తన 50వ సినిమాను కూడా ఈ బ్యూటీ ప్రకటించింది.

ALSOREAD:ఐకాన్ మూవీ హీరో మారాడు..