సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ సౌత్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకుంది అంజలి. లీడ్ రోల్స్‌తో పాటు పలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తోంది. తాజాగా తను హీరోయిన్‌గా కొత్త మూవీ ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అంజలిని వెల్‌కమ్ చేస్తూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విశాల్ హీరోగా నటిస్తోన్న 35వ చిత్రమిది. ‘మద గద రాజా’ చిత్రం తర్వాత విశాల్, అంజలి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా దుషార విజయన్ నటిస్తోంది. తంబి రామయ్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా, దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

